
మళ్లీ పైకి లేచి, మరొక కాలు ముందుకు పెట్టాలి. ప్రతి కాళ్ళతో 10-12 రెపిటిషన్స్, 3 సెట్స్ చేయాలి. కాఫ్ రైజెస్, కాలి కండరాలను బలపరచి, అవి మరింత దృఢంగా మారేందుకు సహాయపడుతుంది. నడక, పరుగుపందెంలో వేగాన్ని మెరుగుపరిచే వ్యాయామం. నిటారుగా నిలబడి, మడమలను పైకి ఎత్తి, మళ్లీ మామూలు స్థాయికి రావాలి. 15-20 రెపిటిషన్స్‌తో 3 సెట్స్ చేయాలి.లెగ్ ప్రెస్ – జిమ్‌లో చేయవచ్చు, కాళ్ళపై పూర్తిగా ఒత్తిడి పెడుతూ, కండరాలను బలపరుస్తుంది. స్పోర్ట్స్ లేదా పరుగు పోటీలకు అనువైన వ్యాయామం.లెగ్ ప్రెస్ మెషిన్‌లో కాళ్లను ప్లేట్‌పై ఉంచి, మోకాళ్లను వంగించాలి.
కాళ్లను నెమ్మదిగా నెట్టి, మళ్లీ తిరిగి మొదటి స్థితికి రావాలి.10-12 రెపిటిషన్స్‌తో 3 సెట్స్ చేయాలి.డెడ్‌లిఫ్ట్, కాళ్ళతో పాటు వెన్నెముక, నడుము, పిరుదుల కండరాలను కూడా బలపరుస్తుంది. శరీరంలోని మొత్తం దృఢతను పెంచే సమగ్ర వ్యాయామం. ఒక బార్‌బెల్ లేదా డంబెల్స్‌ను పట్టుకుని, మోకాళ్ల వంచి, నడుమును ముందుకు వంచాలి. మళ్లీ నిలబడే స్థితికి రావాలి. 8-10 రెపిటిషన్స్‌తో 3 సెట్స్ చేయాలి. వారానికి 4-5 రోజులు ఈ వ్యాయామాలు చేయాలి. సమతుల్యమైన ఆహారం (ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫాట్స్) తీసుకోవాలి. ఫలితాలు త్వరగా రావాలంటే, నడక, పరుగుపందెం కూడా చేయాలి. ప్రతి వ్యాయామాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి, ఒకేసారి ఎక్కువ చేయకూడదు.