వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. మామిడి పండులు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మామిడి పండ్లను ఫ్రిజ్లో పెట్టి తినొచ్చా లేదా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. పండులో రారాజు ఏది అంటే మామిడిపండే. వేసవి అనగానే చాలామందికి గుర్తొచ్చే విషయంలో మామిడిపండు కూడా ఒకటి. వేసవిలో మామిడికాయలకు కొరవే ఉండదు. చాలామంది ఎక్కువగా మామిడి పండ్లలే కొంటూ ఉంటారు. మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటారు.

 అయితే చాలామంది ఒకడే సారీ మామిడి పండ్లను కొని ఫ్రిజ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా మామిడి పండ్లను ఫ్రిజ్లో పెట్టుకుని తినొచ్చా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. మార్కెట్లో వివిధ రకాల మామిడిపండ్లతో నిండి ఉన్నాయి. మనం నచ్చిన వాటిని ఇంటికి తెచ్చుకుని తరచుగా వాటిని ఫ్రిజ్లో ఉంచుతాము. మామిడి పండ్లు ఇంకా పచ్చిగా ఉంటే వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. మామిడి పండ్లు పూర్తిగా పండినప్పుడు వాటిని రిఫ్రిజిరేటర్ లో ఉంచడం మంచిది. మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల వాటి తాజాదనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మామిడి పండ్లు కొన్ని రోజులు ఫ్రిజ్లో నిలువ కుంచాలనుకుంటే..

వాటికి ఉన్న పీల్ తీసేసి సిలు చేసిన కండైనర్స్ లో నిల్వ చెయ్యండి. ఇలా నెల లేదా రెండు నెలల వరకు ఉండవచ్చు. మామిడి పండ్లు త్వరగా పాడవకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. నీటిలో నిలువ చేయాలి. ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసి... మామిడికాయలు వేసి ఓ పాత్రలో ఉంచడం వల్ల మామిడికాయలు కుళ్లిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం మంచిది. ఎందుకంటే ఇది తేమను నియంతరిస్తుంది. పండ్లను తాజాగా ఉంచుతుంది. మీరు మామిడి పండ్లను కట్ చేసి ఉంటే దాని ముక్కలను గాలి చొరబడని కంటైనర్ లో ఉంచి రిఫ్రిజిరేటర్ లో నిలువ చేయండి. మామిడి పళ్ళను రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయవచ్చు అంటే... ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: