
ముఖ్యంగా డయాబెటిస్ లేని వారు గమనించాలి. మచ్చలు, మోల్స్ ఆకారం మారడం, రంగు మారడం, పరిమాణం పెరగడం,చర్మ క్యాన్సర్ యొక్క ప్రాథమిక సూచన. మూత్రంలో, మలంలో రక్తం రావడం, మహిళల్లో యోనిలో రక్తస్రావం, దగ్గినప్పుడు రక్తం రావడం, గ్లానం, మింగలేకపోవడం, మలబద్ధకం, నరంగా తినలేకపోవడం.ఎసోఫేగస్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ సూచనలు. మూడు వారాలకు మించి దగ్గు ఉంటే, గొంతులో శబ్దం మారితే, గొంతు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. ముఖం, కళ్ళు పసుపు రంగులోకి మారితే, కాలేయ క్యాన్సర్ లేదా పాంక్రియాటిక్ క్యాన్సర్ గుర్తింపు కావచ్చు. నిద్రలేమి, చెమటలు రావడం.
నిద్ర సమయంలో ఎక్కువగా చెమటలు రావడం, ప్రత్యేకించి రక్త సంబంధిత క్యాన్సర్లలో కనిపించే లక్షణం. ఈ లక్షణాలన్నీ చూసినంత మాత్రాన క్యాన్సర్ ఉండాలని కాదు. కానీ ఇది శరీరం లోపల ఏదో తప్పుడు విషయం జరుగుతుందన్న సంకేతం. వీటిని నిర్లక్ష్యం చేయకుండా అతిత్వరలో డాక్టర్‌ను సంప్రదించాలి. స్క్రీనింగ్ పరీక్షలు, బ్లడ్ టెస్టులు, సిటీ స్కాన్, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ పొందవచ్చు. పూర్వీకుల్లో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు ప్రతిఏటా హెల్త్ చెకప్ చేయాలి. పొగతాగడం, మద్యం, వేడి నూనె వాడకాలు, ప్రసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. చర్మాన్ని, శరీరాన్ని తరచూ పరిశీలించుకోవాలి.