
వీటివల్ల కొన్ని సార్లు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ విమర్శలే ఎదుర్కొందని చెప్పాలి. అయితే.. మరోసారి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ తో ముడిపడిన ఒక విషయంపై ఆమె మాట్లాడింది. అయితే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిన సంగతి కూడా తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా..! ఈ ఆందోళనలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు.
అయితే దీనిపై పూనమ్ కౌర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుడు, నటుడైన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే.. పెద్ద చర్యనీయాంశం అయ్యింది. కానీ రైతుల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోవడం లేదని.. ఇది హిపోక్రసి కాదా' అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ కు నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఇది అటు ఉంచితే.. పేరు చెప్పకుండా.. వివాదాలను ప్రశ్నించిన పూనమ్ పవన్ కళ్యాన్ నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...!!