అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ సినిమా ఆయన్ని 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేర్చింది.. పేరుకే బ్యాగ్రౌండ్ ఉన్న హీరో కానీ ఈయన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టు, 100 కోట్ల సినిమా ఒక్కటి లేకపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తండేల్ సినిమాతో ఆ మార్కు అందుకున్నారు.అలా వందకోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా తండేల్ మూవీ పేరు తెచ్చుకుంది. ఈ సినిమా వల్ల నాగచైతన్య కి కూడా మంచి గుర్తింపు లభించింది.అయితే అంతా బాగానే ఉంది గానీ తండేల్ మూవీ మాత్రం శోభితతో నాగచైతన్యకు గొడవలు తెచ్చి పెట్టిందట. మరి ఆ స్టోరీ ఏంటి అనేది చూస్తే..తాజాగా నాగచైతన్య జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలోకి గెస్ట్ గా వచ్చారు.ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వచ్చి ఈ టాక్ షో ని సక్సెస్ చేయగా తాజాగా నాగచైతన్య వంతు అయింది. 

ఇక ఈ టాక్ షోలో జగపతిబాబు ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగగా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చారు నాగ చైతన్య. ఇందులో భాగంగా మీ తాత గారి పాత్రలో మహానటి సినిమాలో చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది అని అడగగా.. తాత పాత్రలో నటించి ఆయనకు ట్రిబ్యూట్ ఇద్దాం అనుకున్నా.. ఆ అవకాశం వచ్చింది చేసేసాను. అదో గొప్ప ఫీలింగ్ అంటూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే మనం సినిమాలో తండ్రి తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ నాన్నతో కలిసి చేయడం గొప్ప అనుభూతి కానీ చాలా కష్టం కూడా అంటూ చెప్పుకొచ్చారు.ఇక నీ జీవితం గురించి ఒక బుక్ కి టైటిల్ పెట్టాలనుకుంటే ఏం చేస్తావ్ అని అడగగా.. నా జీవితం అనే బుక్ లో పులిస్టాప్ లు ఉండకూడదు.కామాలు మాత్రమే ఉండాలి. కామాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితం.. అంటూ జగపతిబాబు ఫిదా అయ్యా ఆన్సర్ ఇచ్చారు నాగచైతన్య.

అలాగే గొడవల గురించి మాట్లాడుతూ..గొడవలు లేకపోతే రిలేషన్షిప్ నిలవదు.గొడవలు పెట్టుకోవడంలో కూడా ఓ అందం ఉంటుంది.అలాగే తండేల్ సినిమా విడుదలైన సమయంలో కూడా నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు అంటూ నాగచైతన్య చెప్పిన ప్రోమో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పలేదు. ఇక నాగచైతన్య మాట్లాడలేదు అని చెప్పింది శోభిత ధూళిపాళ్లనే అని అందరికీ అర్థమైంది. అలా తండేల్ మూవీ విడుదలైన సమయంలో నాగచైతన్యతో శోభితకి గొడవలు అయ్యాయని,కానీ ఆ గొడవలు అయితేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని నాగచైతన్య చెప్పినట్టు అర్థమవుతుంది.ఇక దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ టీవీలో చూడాలంటే ఆదివారం రాత్రి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: