తెలుగు సినిమా నటిగా ప్రగతి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  ఆమె నటించిన ఏమైంది ఈ వేళ చిత్రంలో పోషించిన హీరో తల్లి పాత్రకు గాను ఆమెకు ఉత్తమ సహాయనటి నంది పురస్కారం లభించింది. ఉత్తమ సహాయ నటి నంది పురస్కారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎంతో పోటీ మధ్య ఈ విధమైన పురస్కారం అందుకుంటారు. అలాంటి ఈ అవార్డును ప్రగతి ఇంత తొందరగా అందుకోవడం అంటే పెద్ద విశేషం అని చెప్పాలి.  

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి కి సహాయం గా ఉండడం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడగా ఆమె కాలేజీ మొదటి సంవత్సరంలో ఉండగా మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటన లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తన సినిమాలో ఆమెకు కథానాయికగా అవకాశం ఇచ్చాడు. అలా రెండు సంవత్సరాల పాటు ఆమె 7 తమిళ సినిమాలు ఒక మలయాళం సినిమాలో నటించగా ఆ తర్వాత వివాహం కావడంతో ఆమె రెండు సంవత్సరాల పాటు కొద్దిరోజులు విరామం తీసుకుంది.

ఆ సమయంలోనే మూడు భాషల టీవీ సీరియల్లో నటించడం మొదలు పెట్టింది.  ఆ తర్వాత ఆమె సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టాక ఆమె కి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అక్క తల్లి వదిన చెల్లెలు పాత్రలో నటించిన ఈమె పెద్ద హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చూడగానే మన ఇంటి పిల్లే అనిపించే ప్రగతి ఇటీవల కాలంలో ఆమె హాట్ హాట్ వర్కౌట్ వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. టాటూలు వర్కౌట్ లు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఆమె యంగ్ హీరోయిన్ లా చేసే పోస్టులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆమెకు కళ్యాణ వైభోగమే చిత్రం ద్వారా కూడా నంది అవార్డు లభించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: