చైతు -స‌మంత విడాకుల త‌ర్వాత వీరు ఎందుకు విడిపోయార‌న్న దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగేశ్వ‌ర‌రావుకు అటు సొంత సామాజిక వ‌ర్గంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ గ‌ట్టి ప‌ట్టే ఉంది. ఆయ‌న సామాజిక వ‌ర్గం అయిన క‌మ్మ వ‌ర్గంలో ఎంతో మంది ఆయ‌న‌కు స‌రితూగే వారు ఆయ‌న‌తో వియ్యం అందుకునేందుకు వ‌చ్చేవార‌ట‌.

నాగార్జున‌కు పిల్ల‌ను ఇచ్చేందుకు క‌మ్మ వ‌ర్గంలో ఎంతో మంది ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌వారు వ‌స్తే.. వియ్యం అందుకునేందుకు త‌న‌కు ఇష్ట‌మే అని.. అయితే వివాహ బంధం విష‌యంలో మాత్రం తాను గ్యారెంటీ ఇవ్వ‌లేన‌ని చెప్పేవార‌ట‌. అంద‌రి ఫ్యామిలీల్లో వివాహ బంధాల్లా త‌మ ఫ్యామిలీల్లో వివాహ బంధాలు ఉంటాయ‌న్న న‌మ్మ‌కం మాత్రం పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పేవార‌ట‌.

అక్కినేని ఆ మాట కాక‌తాళీయంగా అని ఉంటారేమో గాని నిజంగానే ఆ ఫ్యామిలీలో ప‌లువురి వైవాహిక బంధాలు విచ్ఛిన్న‌మ‌య్యాయి. నాగార్జున‌, నాగ చైత‌న్య‌తో పాటు సుమంత్‌, సుప్రియ పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. ఇక అఖిల్‌కు సైతం ఎంగేజ్‌మెంట్ జ‌రిగాక క్యాన్సిల్ అయ్యింది. ఇలా అక్కినేని నాడు ఏ ఉద్దేశంతో త‌మ కుటుంబం తో వియ్యం క‌లుపుకున్నా వైవాహిక బంధం విష‌యంలో హామీ ఇవ్వ‌న‌ని చెప్పిన మాటే ఇప్పుడు నిజం అయ్యింది.

ఇక అక్కినేని వార‌సుల్లోనే మ‌రొక‌రి వైవాహిక బంధం కూడా దాదాపు విచ్ఛిన్న‌మైంద‌నే అంటున్నారు. నాగార్జున  రామానాయుడు కుమార్తె శ్రీ ల‌క్ష్మిని పెళ్లి చేసుకున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు బ‌ల‌మైన వ్య‌క్తులు వియ్యం అందుకున్నార‌ని సంతోషించారు. అయితే వారి బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు.

ఇక నాగ‌చైత‌న్య - స‌మంత విష‌యంలోనూ అదే జ‌రిగింది. స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు అయ్యింద‌న్న ఆనందం నాలుగేళ్ల‌కే పెటాకులు అయ్యింది. ఏదేమైనా త‌న వార‌సుల మైండ్ సెట్ తెలిసే నాడు ఏఎన్నార్ ఈ మాట అని ఉంటారా ? అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: