రజనీకాంత్ హీరోగా
యువ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా కబాలి. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్ దక్షిణ భారత దేశాన్ని ఎంతగానో అలరించింది అన్న విషయం అందరికీ తెలిసిందే.
రజినీ కాంత్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా ఈ
సినిమా కలెక్షన్ ల ను చెప్పుకోవచ్చు. ఈ
సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఆ
సినిమా అందుకున్న రికార్డులను బట్టి చెప్పవచ్చు.
రజినీకాంత్ తొలిసారిగా స్టార్ దర్శకుడితో కాకుండా యంగ్
డైరెక్టర్ తో
సినిమా చేయడం స్పెషల్.
ఈ
సినిమా రజినీకాంత్ స్టామినా ను చూపించే విధంగా ఉండడం ఆయనకు ఈ
సినిమా స్పెషల్
సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రాధిక ఆప్టే
హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా కథ కూడా రజనీకాంత్ వయసు కు చక్కగా సూట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ
సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అని చెప్పవచ్చు. 2016 సంవత్సరం లో విడుదలైన ఈ యాక్షన్ క్రైమ్ చిత్రం లో రజిని డాన్ గా నటించగా ఓ గొడవలో కోల్పోయిన తన
భార్య పిల్లల్ని చాలా రోజులు జైలు జీవితం గడిపిన తరువాత ఏ విధంగా వారిని దక్కించుకో గలిగాడు అనేదే ఈ
సినిమా కథ.
ఈ
సినిమా విడుదలైన సమయంలో ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
మలేషియా బ్యాంకాక్
హాంకాంగ్ లలో ఈ
సినిమా చిత్రీకరణ జరుపుకోగా
గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా తైవాన్ నటుడు వింస్టన్ చావో నటించగా మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన విలాసవంతమైన
కార్ లను
మలేషియా లో ఉన్న రజనీకాంత్ అభిమానులు అందించడం విశేషం.
ఆడియో విడుదల రోజున
సినిమా పోస్టర్ల తో రోడ్ షో ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ సమయంలో రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసి
ఇండియన్ రికార్డులను సృష్టించింది చిత్రం. అంతర్జాతీయంగా 10 వేల థియేటర్లలో ఈ
సినిమా విడుదల కాగా చైనాలో మాత్రం 5,000 థియేటర్లలో ప్రదర్శింపబడిన మూడవ భారతీయ చిత్రంగా ఈ
సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది.