టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీ లోకి ఓ రచయితగా అడుగు పెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ సినిమా అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదేమో..ఈయన సినిమాల్లో డైలాగ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన త్రివిక్రమ్.. ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసి టాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

 ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్టర్ చేసిన అల వైకుంఠ పురం లో సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా నాన్ బాహుబలి కలెక్షన్స్ ని సైతం కొల్లగొట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో డైరెక్టర్గా త్రివిక్రమ్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని అనుకుంటారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఆయన అసలు పేరు చాలామందికి తెలియదు. ఇంతకీ ఆయన అసలు పేరు ఏంటంటే 'ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ'. ఆయన సొంతూరు భీమవరం. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రచన పై ఆసక్తి కలిగి ఇండస్ట్రీ వైపు అడుగులు పెట్టారు.

ఆ తర్వాత కొన్నాళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అక్కడినుంచి రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిన ఈ ప్రాజెక్టుని హారిక హాసిని సంస్థ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే మొదలు కాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా మహేష్ తో సినిమా తర్వాత మరోసారి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: