తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్.. ప్రస్తుతం నిర్మాత గా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇతను మెగా ఫ్యామిలీ కి వీరాభిమాని అనే విషయం కూడా అందరికీ తెలుసు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు బండ్లగణేష్. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఇతను సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ల వల్ల దారుణంగా రోలింగ్ కి గురి అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్టు వల్ల దర్శకుడు అనిల్ రావిపూడి పరువు పోయినట్లు అయింది.

 అర్థం కాలేదు కదూ? అసలు జరిగింది ఏంటంటే.. నవంబర్ 23 అంటే ఈరోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో బండ్ల గణేష్ అనిల్ రావిపూడి కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలా బండ్ల గణేష్ అనిల్ రావిపూడి కి విష్ చేయడం తో అతను పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నారని కొంతమంది నెటిజన్లు భావించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ స్పందిస్తూ..' అన్నా. అనిల్ రావిపూడి ని పవన్ కళ్యాణ్ తో సినిమా చేయొద్దు అని చెప్పండి పది లక్షలు ఇస్తాం' అంటూ కామెంట్ చేశాడు. అయితే సదరు నెటిజన్ చేసిన ఆ కామెంట్ కి బండ్ల గణేష్ స్పందిస్తూ..' థాంక్యూ ఫర్ యువర్ లవ్' అంటూ ట్వీట్ చేసాడు.

 దీంతో బండ్ల గణేష్ కి అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం నచ్చలేదు అంటూ పరోక్షంగానే అనిల్ రావిపూడి పరువు తీసినంత పని చేశాడు. అయితే ఆ నెటిజన్ చేసిన కామెంట్ అర్థం చేసుకోకుండా బండ్ల గణేష్ ట్వీట్ చేశారా లేక కావాలనే ఇలా స్పందించారా అనేది మాత్రం తెలియదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అయితే బండ్ల గణేష్ ట్రోలింగ్స్ కి గురవడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా చిన్న చిన్న తప్పులు చేసి ట్రోలింగ్స్ కి గురయ్యాడు. కానీ ఈ సారి అందులో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇన్వాల్వ్ అవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: