టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా,  మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, అలాగే అక్కినేని నాగ చైతన్య సరసన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా టీజర్, ట్రైలర్,  పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుండే జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు, ఈ సినిమా విడుదల అయిన మొదట షో నుండే  పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా థియేటర్ లలో వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఇదిలా ఉంటే బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది,  సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది,  అయితే బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం కూడా లేకపోవడంతో ఆయన అభిమానులు కొంతమంది నిరాశపడ్డారు.  అయితే ఇలా బ్రహ్మానందం 'బంగార్రాజు'  సినిమాలో లేకపోవడంపై నాగార్జున తాజాగా స్పందించాడు,  సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత 30 సంవత్సరాలకు ఈ కథ ప్రారంభం అవుతుంది.  ఒకవేళ ఈ కథలో బ్రహ్మానందం పాత్రను పెట్టవలసి వస్తే 80 సంవత్సరాల వ్యక్తిగా చూపించాల్సి వస్తుంది,  అదో పెద్ద కథ అవుతుంది.  అందుకే బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం పాత్రను పెట్టలేదు అని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: