పెద్ద విజయాలు లేకపోయినా కూడా గోపీచంద్ తన సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గని విధంగా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ తర్వాత కూడా సినిమాలను ఓకే చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్న చిత్ర బృందం కిలాడి సినిమాలో హీరోయిన్ గా చేసిన డింపుల్ హయాతి అనుకుంటున్నారట

తెలుగు అమ్మాయి అయినా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగులో నటించి ఆ తర్వాత సినిమా హీరోయిన్ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించింది ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టిన ఆమె ఆ ఛాన్సును ఉపయోగించుకుంది ఈ సినిమాలో ఆమె చేసిన నటనకు ఫిదా అయ్యారు అవసరానికి మించి మరి తన గ్లామర్ ను యూత్ కు చూపించి బాగా ఎట్రాక్ట్ చేసి ఇప్పుడు భారీ క్రేజ్ తెచ్చుకుంది.

ప్రేక్షకులలో ఉన్న క్రేజ్  గమనించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె కాదనక పోవడానికి ఇది చిన్న సినిమా కాదు ఈ లెక్కన ఈమె ఒప్పుకుని చేస్తే ఈ సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుండగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. గోపీచంద్ గత సినిమాల లాగానే ఈ సినిమా కూడా పక్క మాస్ మసాలా సినిమా గానే తెరకెక్కబోతుంది. మరి మరిన్ని సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇంకెన్ని సినిమాల అవకాశాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: