వరుస సినిమాలతో ఫుల్ క్రేజ్ వున్న హీరోయిన్ లు కూడా  ఐటమ్ సాంగ్ లలో నటిస్తున్నారు,  అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లు కొనసాగుతున్న సమయంలో ఐటెం సాంగ్ లలో నటించి మెప్పించారు,  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న హీరోయిన్ లుగా కొనసాగుతూ ఐటమ్ సాంగ్ లలో నటించిన హీరోయిన్ ల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

తమన్నా : తమన్నా  హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ఉన్న సమయం లోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది, తమన్నా ఆ తర్వాత జై లవకుశ,  కే జి ఎఫ్,  సినిమాలలో కూడా ఐటమ్ సాంగ్ లలో నటించింది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా తమన్నా గని సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది,  ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.

పూజా హెగ్డే : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న సమయం లోనే రంగస్థలం సినిమా లో స్పెషల్ సాంగ్ లో నటించింది.

సమంత : అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే, అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే,  పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ తో సమంత ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

కాజల్ అగర్వాల్ : అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: