అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ 'చందమామ' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది . ఆ తర్వాత మగధీర మూవీ తో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారి పోయింది.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక మూవీ లాలి నటించిన కాజల్ అగర్వాల్ ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ కొన్ని రోజుల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది . మాతృత్వం కోసం కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్ కాజల్ అగర్వాల్ మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతోంది . తాజాగా నేహా ధూపియాతో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ స్వయంగా చెప్పు కొచ్చింది. 

సెప్టెంబర్ 13 వ తేదీ నుంచి కమల్ హాసన్ హీరో గా తెరకెక్కబోతున్న ఇండియన్ 2  మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు,  కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించింది. ఇలా కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చింది. కాజల్ అగర్వాల్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ భాషల సినిమాల్లో కూడా నటించి ఆ ప్రాంతాల ప్రేక్షకుల నుండి కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: