తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న సుదీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించ గా , కృతి శెట్టి ఈ మూవీ లో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయ నున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి కొన్ని పాటలను విడుదల చేసింది . వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో సాంగ్ విడుదల తేదీని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది . 

అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ నుండి 'ఆ మెరిపేమిటో' అనే సాంగ్ ని ఆగస్టు 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది . మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే సుదీర్ బాబు , ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం మరియు వి మూవీ లు తెరకెక్కయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా కావడంతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: