నట సింహం నందమూరి బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ కాగా త్వరలో ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటించలేదు.ఇక  ఇప్పటికే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయినా ...ఈ సినిమాకు టైటిల్ ప్రకటించకపోవడం ఏమిటని బాలయ్య అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఒక పాట వల్ల ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని క్లారిటీ వచ్చింది.  మేకర్స్ మాత్రం పోస్టర్ ద్వారా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే  'జై బాలయ్య' అనేది బాలయ్య స్లోగన్ అనే సంగతి తెలిసిందే.కాగా యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడంతో జై బాలయ్య అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయడం కరెక్టేనా అని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే  ఈ సినిమాకు జై బాలయ్య టైటిల్ ఫిక్స్ అవుతుందా?

 లేక మేకర్స్ ఈ సినిమా కోసం మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.ఇకపోతే బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక బాలయ్య, శృతి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.అయితే  ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేననే సంగతి తెలిసిందే. కాగా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాలయ్య కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: