టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో ఆయన తన సినిమాలను తెరకెక్కించకపోయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు సైతం మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఏడాది మహేష్ బాబుకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా అంతంతమాత్రంగానే విజయాన్ని పొందింది. మరొక పక్క జనవరిలో తన అన్నయ్య రమేష్ బాబు మరణించడం.. సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి స్వర్గస్తులవడం.. తిరిగి నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు తండ్రి తీరని లోకాలకు వెళ్లిపోవడం అన్ని మహేష్ బాబుకు మరింత దుఃఖాన్ని మిగిల్చాయి.


అయితే ఆ బాధ నుంచి బయటపడ్డానికి మహేష్ బాబు ఇలా లొకేషన్స్ కి వెళ్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  నిజానికి ఆయన తన బాధ నుంచి విముక్తి పొందడానికి సినిమా షూటింగ్లలో పాల్గొనాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు పూజా కార్యక్రమాలు పూర్తిచేసి.. షూటింగ్ కూడా మొదలు పెట్టాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జనవరి చివరి వారానికల్లా షూటింగ్ ప్రారంభించాలని మహేష్ బాబు ,  త్రివిక్రమ్ ఇద్దరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ఫుల్ లెన్త్ షూటింగ్ పూర్తి చేసి జూన్ లోపల సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ప్రస్తుతం సమయం ఖాళీగా ఉండడంతో మహేష్ బాబు ఏకంగా తన ఫ్యామిలీతో కలిసి 15 రోజుల పాటు యూకే వెకేషన్ కి వెళ్లనున్నారు. అక్కడే క్రిస్మస్,  న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి రాగానే మహేష్ బాబు తన చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: