రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాను హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ , లైక్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల ఆయన 24 గంటల్లో 14.48 మిలియన్ వ్యూస్ ... 513 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ లభించింది. కానీ ప్రభాస్ అభిమానులు ఈ మూవీ ట్రైలర్ అనేక ట్రైలర్ రికార్డులను బద్దలు కొడుతుంది అని అద్భుతమైన వ్యూస్ , లైక్స్ ను సాధిస్తుంది అని భావించారు.

ఆ స్థాయి రికార్డులను నిలకలపడంలో మాత్రం ఏ ట్రైలర్ సక్సెస్ కాలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి రాజ సాబ్   మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: