యాంకర్ సుమ.. ఈమె గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగానే తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా కొనసాగుతుంది సుమ. ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త యాంకర్లు వచ్చారు పోయారు. కాని సుమా మాత్రం ఇండస్ట్రీలో పాతుకు పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టార్ మహిళ అనే కార్యక్రమంతో ఒక్కసారిగా స్టార్ యాంకర్ గా మారిపోయింది సుమ.


 ఇక ఆ తర్వాత పట్టిందల్లా బంగారం అయినట్లు సుమ ఏ షో చేసినా కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక సుమా వాక్చాతుర్యంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది అని చెప్పాలి. ఇక సుమ చలాకి తనం ముందు ఏ యాంకర్ పనికిరారు అనే విధంగా తన హవా నడిపించింది.అయితే ఇప్పటికి ఎన్నో షో లతో ప్రేక్షకులను అలరించిన సుమా.. ఇటీవల  క్యాష్ అనే కార్యక్రమాన్ని ఆపేసి ఆ షో స్థానంలో సుమ అడ్డ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి వచ్చారు అని చెప్పాలి.


 దీంతో ఇక ఒక్కసారిగా ఈ షోపై హైప్ పెరిగిపోయింది. అయితే ఇక ఎప్పటిలాగానే ఈ షోలో సుమ తనదైన స్పాంటీనీటి పంచులతో ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. అయితే సుమ అడ్డ అనే కార్యక్రమంలో యాంకర్ సుమ కాస్త హద్దులు దాటి పంచులు వేస్తుంది అని కొంతమంది ప్రేక్షకులు అనుకుంటున్నారట. దీంతో సుమ ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా రేటింగ్స్ కోసం ఎందుకు చేస్తుంది అని అభిమానులు కూడా భావిస్తున్నారట. చిరంజీవి ఎపిసోడ్లో అల్లరి బాగా చేసిన సుమ.. ఇక జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వచ్చిన ఎపిసోడ్లో కాస్త హద్దులు మీరి పంచులు వేసినట్లు కొంతమంది ప్రేక్షకులు అనుకుంటున్నారట. అయితే సుమ కొత్త ప్రవర్తనతో ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది మాత్రం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: