టాలీవుడ్ ఇండస్ట్రీ లో కష్ట పడి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ మంచి స్థాయికి చేరుకున్న నటులలో రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత ఈయన హీరో గా అవకాశాలను దక్కించుకొని ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన చాలా సినిమాలు  వరుస పెట్టి బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈయన మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక రంగనాథ్ ను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఆశిక రంగనాథ్  , నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో  ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt