సహనం లేని వ్యక్తి జీవితంలో ఏది సాధించలేక ఒంటరిగా ఈ ప్రపంచంలో మనుగడ సాధించవలసి వస్తుంది. అదే సహనంగా ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారాలను తనకు తానుగా అన్వేషిస్తూ విజయతీరాలకు చేరుకుని ఆపై తాను కోరుకున్న సంపదను పొందగలుగుతాడు.


సహనం అంటే ఇతరుల పట్ల గౌరవంతో మెలగడమే కాదు. ఎదుటి వ్యక్తితో ఎదో ఒక విషయంలో రాజీ పడుతూ సద్దుబాటు చేసుకోవడం కూడ సహనం కింద పరిగణింప బడుతుంది. మనిషికి ఉన్న అనేక రకాల అజ్ఞానాలలో సహనం లేకపోవడం ఎక్కువ బాధను కలిగిస్తూ మనిషిని విజయానికి దూరంగా తీసుకు వెళ్ళి పోతుంది. అందుకే అజ్ఞాన ఫలితమే అసహనం అంటారు.


మనం పేరిగిన వాతావరణం వారసత్వ లక్షణాల ప్రభావం వల్ల అసహనం ఏర్పడుతుంది. దీనికితోడు మన విశ్వాస అవిశ్వాస విషయాలకు సంబంధించిన భావాలు కూడ మనలను ప్రభావితం చేస్తూ మనకు కొన్నికొన్ని సందర్భాలలో అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అనేక మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉండటంతో వారందరితో సమన్వయం చేసుకునే పరిస్థితులు ప్రతి వ్యక్తికి ఎదురౌతాయి. ఈ పరిస్థితులను చాల సమర్థవంతంగా సమన్వయం చేసుకునే వ్యక్తికి చాల సహనం ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాలలో రాణించాలి అని కోరుకునే వ్యక్తికి సహనం చాల అవసరం.


అయితే అసహనం కలిగిన ప్రతివ్యక్తి దుర్మార్గుడు కాడు అతడితో సన్నిహితంగా ఉండటానికి చాలామంది ఇష్టపడరు. దీనితో అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తికి అవకాశాలు చాల తక్కువగా వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలతో ఎదుట వ్యక్తి ఏకీభవించాలని కోరుకుంటాడు అలా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తమ అభిప్రాయాల విషయంలో ప్రభావితం చేయాలి అంటే సహనం ఎంతో కీలకంగా మారుతుంది. అందువల్లనే ప్రపంచ ధనవంతులుగా పేరు గాంచిన అనేక మంది గొప్ప వ్యక్తులు అత్యంత సహనంతో ఎదుట వ్యక్తి చెప్పే మాటలను మౌనంగా వింటూ ఆ తరువాత మాత్రమే తమ వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అని చెపుతూ ఉంటారు. అందుకే సహనం ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం అక్కడ ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: