ఇటీవల కాలంలో చాలా వరకు పోస్ట్ ఆఫీస్ లు రకరకాల సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇక ఈ పథకాలలో ఎవరు చేరినా, వారికి తప్పకుండా లాభార్జన అనేది ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు కూడా ఒక సరికొత్త స్కీమ్ ను పోస్ట్ ఆఫీస్ తమ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఈ పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ఏమిటి..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించి, వృద్ధాప్యంలో సంతోషంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని అనుకుంటారో.. అలాంటివారికి పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు చేయూత నిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా సరికొత్తగా భారతదేశ పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర  అనే ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ డబ్బు సురక్షితమే కాకుండా మెచ్యూరిటీ డబ్బులు రెట్టింపు స్థాయిలో కూడా పొందవచ్చు..


కిసాన్ వికాస్ పత్ర అనేది ఒకసారి పెట్టుబడి పెట్టే పథకం. మీరు ఒక నిర్ణీత కాలంలో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది. భారతదేశంలోని పెద్ద పెద్ద బ్యాంకులలో కూడా ఈ పథకం అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ కాల 124 నెలలుగా నిర్వహించబడ్డాయి. ఈ పథకంలో ₹1000 కనిష్టంగా పెట్టుబడి పెట్టాలి.. గరిష్టంగా పరిమితి లేదు. ఇక ముఖ్యంగా రైతులు అలాగే తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తుల కోసం మాత్రమే ఈ పథకాన్ని సృష్టించడం జరిగింది. తద్వారా మీ డబ్బును తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందవచ్చు. మీరు ఒకేసారి ఐదు లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ కాలం దాటిన తర్వాత మీకు పది లక్షలు లభిస్తాయి. అంతేకాదు 6.9 శాతం వడ్డీ కూడా లభించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: