జగనన్న ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళలను దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎన్నో రకాలుగా సహాయపడుతూ వున్నారు.. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న 45 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ తమ ఖాతాలో 15 వేల రూపాయలను జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఈ బిసి అగ్ర కులాల మహిళలు కూడా 45 సంవత్సరాలు నిండిన వారికి 15 వేల రూపాయలు వేస్తామని ప్రకటించాడు. ఇక పోతే మరొక శుభవార్త ఏమిటంటే, ఆడపడుచులకు జగనన్న  ఈ నెల అక్టోబర్ 7వ తేదీన వారి ఖాతాలో డబ్బు జమ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేశాడు.

డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు ఈ సదుపాయం కల్పించబడింది. ఇకపోతే అక్టోబర్ 7వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాలను డ్వాక్రా మహిళల ఖాతాలోకి బదిలీ చేయనున్నారు.. గత నెలలోనే చేపట్టాల్సిన ఈ పథకం కాస్త ప్రభుత్వం అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ ఆసరా పథకం లో భాగంగా అక్కాచెల్లెళ్లకు 8 లక్షల 22వేల డ్వాక్రా సంఘంలలో 78,75,599 మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. మొత్తం రూ. 6470 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది..

2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు అనగా ఎన్నికల హామీ ముందువరకు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను ప్రభుత్వం ద్వారా తీరుస్తానని  సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు మొదటి విడత కింద సెప్టెంబర్ 11వ తేదీన రూ.6330 కోట్ల రూపాయల మొత్తాన్ని నగదు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది.. అలాగే ఈ సంవత్సరం కూడా  చేయాలని నిర్ణయించుకున్న అప్పటికీ ,నిధుల కొరత ఉండటంతో రెండో విడతను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేయడం జరిగింది . ఎవరైతే డబ్బు కావాలని ఇబ్బంది పడుతున్నారా వారికి, బ్యాంకు అదనంగా ఇచ్చేలా సిబ్బంది ఉపయోగపడుతుందని జగన్ ప్రభుత్వం.




మరింత సమాచారం తెలుసుకోండి: