మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. ఎలా అంటే పలు బ్యాంకులు చౌక వడ్డీకే రుణాలు అందించడానికి ముందుకు వచ్చాయి. మరి ఏ ఏ బ్యాంకుల్లో రుణాలపై ఎలాంటి వడ్డీ రేట్లు లభిస్తున్నాయి అనే విషయానికి వస్తే తక్కువ వడ్డీ కే పర్సనల్ లోన్స్ అందిస్తున్న బ్యాంకు ల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే.. టెన్యూర్ 84 నెలల వరకు ఉంటుంది.  అంటే ఈ లోన్ పై వడ్డీ రేటు 9.1 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.20 లక్షల వరకు లోన్ తీసుకుంటే.. ఈ బ్యాంకులో కూడా 84 నెలలు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు కూడా 9.25% నుంచి ప్రారంభం అవుతుంది.

కరూర్ వైశ్యా బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే వడ్డీ రేటు 10.2% నుంచి ప్రారంభం అవుతుంది. 12 నెలల నుంచి 60 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.  ఇందులో రూ. 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు 10.15% నుంచి ప్రారంభం అవుతాయి.  60 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. రూ. 10 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

ఫెడరల్ బ్యాంకులో అయితే రూ. 25 లక్షల వరకు లోన్ లభిస్తుంది. కానీ 48 నెలల్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

ఐడిబిఐ బ్యాంకులో రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు.  60 నెలల వరకు పర్సనల్ లోన్ పై టెన్యూర్ ఎంచుకోవచ్చు.  అలాగే వడ్డీ రేటు 10.25% నుంచి ప్రారంభం అవుతుంది.

ఇండియన్ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలి అని భావిస్తే.. రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది. 36 నెలల వరకు టెన్యూర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.  అయితే ఇక్కడ వడ్డీ రేటు 10.65% నుంచి ప్రారంభం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: