చాలామంది హిందువులు సైతం ఎక్కువగా పూజలో కచ్చితంగా అగర్బత్తిని ఉపయోగిస్తూ ఉంటారు.. ఏవైనా పండుగల సమయంలో పూజల సమయంలో కచ్చితంగా ఇల్లంతా ఇదే సువాసనతో నిండి ఉంటుంది. అయితే ఈ అగర్బత్తి తయారీలో ఎక్కువగా రసాయనాలను సైతం ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే వీటి పోగ పీల్చడం వల్ల చాలా ప్రమాదం ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే సుగందాలతో పూలతో రసాయనిక రహిత అగర్బత్తులను కూడా తయారు చేస్తూ చాలామంది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇలాంటి అగర్బత్తిలకు మార్కెట్లో కూడా మంచి రాబడి ఉన్నది..


అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూడా ఈ వ్యాపారాన్ని సైతం ఎవరైనా ప్రారంభించవచ్చు.. ఇది స్వయం సమృద్ధిగా జీవించే మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.. అంతేకాకుండా వీటి తయారీకి కావాల్సిన శిక్షణను కూడా అందించడం వల్ల కోట్లల్లో ఈ అగర్బత్తి మార్కెట్లను కైవసం చేసుకోవచ్చు. ఇటీవల జార్ఖండ్ లో ఒక వ్యక్తి లక్ష్మీ గ్రూప్ పేరుతో పవన్ కుమార్ అనే వ్యక్తి అగర్బత్తి ల తయారీలను మొదలుపెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.. అగర్బత్తీలు చేయడం ద్వారా తమ జీవితాన్ని మార్చేసిందని చాలామంది మహిళలు కూడా తెలియజేస్తున్నారు.


పవన్ కుమార్ తండ్రి దగ్గర ఎక్కువగా వ్యాపార కలలు నేర్చుకొని.. ఆ తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించారట. తన తండ్రి వినోద్ ప్రసాద్ స్వీట్స్ ఇతరత్రాహార సంబంధిత వ్యాపారాలను నడిపే వారని ఆ తర్వాత పవన్ కుమార్ కూడా అగర్బత్తుల వ్యాపారంలో అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. పవన్ కుమార్ 21 ఏళ్ల క్రితం తన ఇంట్లోనే ఈ అగర్బత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టగా అతి తక్కువ పరిమాణంలో తయారుచేసి మార్కెట్లోకి వెళ్లి విక్రయించేవారు.ఆ తర్వాత నెమ్మదిగా స్థానిక పట్టణం నుంచి జిల్లాల వారీగా కూడా అగర్బత్తులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రోజుకి 300కు పైగా డజన్ల  అగర్బత్తులను తయారు చేస్తూ అమ్ముతున్నారట.. అలా ప్రస్తుతం ఝార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వరకు తన అగర్బత్తూరు వెళుతున్నాయని దీనివల్ల ప్రతినెల 12 నుంచి 15 లక్షలు విలువైన అగరబత్తులను అమ్మేస్తున్నారట. ఈయన కంపెనీలు 8 మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు.


వీటికి కావలసిందల్లా చెక్క పొడి బొగ్గు పొడి కొన్ని పదార్థాలు మాత్రమే ఉపయోగిస్తున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: