చాలామంది భవిష్యత్రం దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత సేవింగ్స్ సైతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి యొక్క ఆదాయాలకు అనుగుణంగానే డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు.. రిస్క్ తక్కువగా ఉండి మంచి లాభాలు వచ్చే వాటి పైన ఎక్కువమంది ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగం పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే ఒక బెస్ట్ ప్లాన్ అందిస్తోంది.. అందులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటట..


ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్కు తక్కువగా ఉంటుంది. మంచి రిటర్న్ కూడా పొందవచ్చు.. ఈ పథకంలో భాగంగా వడ్డీ శాతం 6.5 ఉన్నది ఈ పథకంలో మనం రూ .100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.. గరిష్ట పరిమితి అనేది ఏమీ లేదు.. అయితే ఈ పథకంలో ప్రతి నెల కూడా ఎంతో కొంత డబ్బులను జమ చేయవలసి ఉంటుంది.. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం ఐదేళ్లు కచ్చితంగా పెట్టుబడి పెట్టాలట ఆ తర్వాత మీ డబ్బులను ఒకేసారి తీసుకోవచ్చు.


మనం పెట్టుబడిన పెట్టుబడి ఆధారంగా రిటర్న్ సైతం పొందవచ్చు.. ఉదాహరణకు రూ .1000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 లక్షలు ఎలా సొంతం చేసుకోవచ్చనే విషయంలోకి వస్తే.. రూ.1000  నెలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐదేళ్లకు రూ .60000 అవుతుంది. మీకు వడ్డీ రూపంలో 11000 జమ అవుతుంది.. ఈ డబ్బుని మీరు ఐదేళ్లు పొడిగిస్తే ..1.2 లక్షలు అవుతుంది. అందుకు వడ్డీ కలుపుకుంటే మొత్తం మీద.. రూ.1.69 లక్షలు వస్తాయి.. అలా మొత్తం మీద మరో 5 ఎళ్లు పొడిగిస్తే .. రూ.2.4 లక్షల సైతం వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏకంగా రూ .5 లక్షల రూపాయలను ఫలితం తీసుకోవచ్చు.. అయితే 20 ఏళ్లు అనేది పెద్ద సమయం అయినప్పటికీ కూడా. ఉద్యోగి పదవి విరమణ సమయానికి రూ .5లక్షలు రావడం చాలా ఉపయోగకరమని కూడా చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: