ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సామాన్య ప్రజలు బతకాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పనిగా మారిపోయింది. అందుకే చాలా మంది ఉద్యోగంతో పాటు ఇతరత్రా బిజినెస్ వైపుగా అడుగులు వేస్తున్నారు. మరి కొంత మంది ఒకేసారి రెండు ఉద్యోగాలను కూడా చేస్తూ ఉన్నారు. మనలో చాలా మంది ఉన్న చోటునే సంపాదిస్తూ కోటీశ్వరులు అవుతున్నవారు కూడా ఉన్నారు. అయితే బిజినెస్ చేసి భారీగానే సంపాదిస్తున్నారు..కేవలం మహిళలు సైతం వారికి ఉన్న ఖాళీ సమయాన్ని ఉపయోగించి వ్యాపారాన్ని ప్రారంభిస్తే లక్షల సైతం సంపాదించవచ్చట ఆ బిజినెస్లను చూద్దాం.


1). బ్రెడ్ తయారీ:
ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఒక వ్యక్తి నెలలో భారీగా సంపాదించుకోవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని కేవలం ఇంటి వద్దనే ఉండి కూడా మొదలు పెట్టవచ్చు. ఈ బ్రెడ్ తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. రూ.10 వేల రూపాయలతో పెట్టుబడి పెడితే చాలు.. బన్నులు, బ్రెడ్ తయారీ వంటి వాటిని చేసుకుంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. వీటికి కావాల్సిన ముడి సరుకు తీసుకొని ప్రారంభించుకోవచ్చు. అలా మార్కెట్లో విస్తృతంగా తమ వ్యాపారాన్ని పాపులర్ చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది.


ఎన్వలప్ కవర్స్ వ్యాపారం:
మనలో ఎక్కువ మంది ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్న సమయంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.. మనీని ఇందులో పెట్టి ఇవ్వడానికే మక్కువ చూపుతారు ప్రజలు.. వీటిని చాలా స్టైలిష్ గా డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకొని వెళ్తే మంచి లాభాలను అర్జించవచ్చు.

హోమ్ క్యాంటీన్:
ఇంటిదగ్గర ఏదైనా ఖాలి స్థలం లేకపోతే డాబా మీద క్యాంటీన్ వంటిది ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి..ముఖ్యంగా చిన్న చిన్న ఫంక్షన్లకు ఆర్డర్లు తీసుకోనీ ఫుడ్ ని డెలివరీ చేస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే మొదట క్యాంటీన్ కోసం కాస్త పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ డిమాండ్ బట్టి లాభాలు వస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: