టాలీవుడ్ లో ఇద్దరు హీరోలకు, అదీ అన్నదమ్ములకు ఒకే లాంటి పరిస్థితి ఎదురైంది. తొలి సినిమా రిలీజ్ చేయడంలో వారికి ఎందుకో విధి సైతం సహకరించదు. వారే మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ తొలుత నటించిన సినిమా రేయ్ అయినా రిలీజ్ అయ్యింది మాత్రం తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా.. అయితే ఇదే సెంటిమెంట్ ఇప్పుడు తమ్ముడు వైష్ణవ్ తేజ్ విషయంలో జరుగుతుంది. వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఉప్పెన సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.. అయితే కరోనా కారణంగా ఇంకా రిలీజ్ కాలేదు..