టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా ఉన్న వంశీ పైడిపల్లి కి ఇప్పుడు టైం అస్సలు బాలేదని చెప్పాలి.. టాలెంట్ ఉన్నా ఎక్కువ గుర్తింపు రాని దర్శకులలో మొదట చెప్పుకోవాల్సింది ఈ డైరెక్టర్ నే.. మొదటి సినిమా మున్నా తోనే వంశీ టాలెంట్ గురించి అందరికి తెలిసిపోయింది.. ఆ సినిమా ఫ్లాప్ అయిన వంశీ దర్శకత్వ ప్రతిభ ను అందరు గుర్తించారు. రెండో సినిమా బృందావనం తో సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక మూడో సినిమా ఎవడు కూడా హిట్ అవడంతో వంశీ కి ఎదురులేదు అనుకున్నారు. కానీ అప్పుడే సరిగ్గా వంశీ కష్టాలు ఎదురయ్యాయి అని చెప్పొచ్చు.