బుల్లితెరపై ఇప్పుడు టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి.. వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లెటరా కలర్ఫుల్ గా కనపడుతుంది.. అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి బుల్లితెర అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు.