అక్కినేని హీరో నాగ చైతన్య హిట్లు , ఫ్లాప్ లతో సంభందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. అయన నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. మజిలీ సినిమా తో పర్వాలేదనిపించినా వెంకీ మామ చిత్రం మాత్రం ప్రేక్షకులను నిరాశనే మిగిల్చింది. అంతకుముందు కూడా చైతు భారీ ఫ్లాప్లనే మూటగట్టుకున్నాడు.. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు..