దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం rrr .. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దానికి rrr సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ తారాగణం నటిస్తుంది.. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర లో నటిస్తుండగా, అలియా భట్ రామ్ చరణ్ సరసన నటిస్తుంది.