దసరా కానుకగా విడుదల అయిన ‘కంచె’ సినిమాకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ కూడా నెమ్మదిగా మెరుగు పడుతూ ఉండటంతో ‘కంచె’ టీమ్ సక్సస్ ను సెలెబ్రేట్ చేసుకుంటోoది. దీనితో ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయడానికి ఈ సినిమా యూనిట్ రంగంలోకి దిగింది. 

దీనికితోడు ఈ సినిమాకు మెగా స్టార్ చిరంజీవి ప్రమోషన్ కూడా ‘కంచె’ కు కలిసి వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘కంచె' పై ప్రశంసల వర్షం కురిపించాడు.  అంతేకాదు తన పొగడ్తలతో క్రిష్ ను ఆకాశానికి ఎత్తేసాడు. ఈ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాను ప్ర‌యోగాత్మ‌క సినిమా అని అన‌డానికి వీల్లేదుఅని అంటూ క‌మ‌ర్షియ‌ల్‌ అంశాలతో ఉన్న అంద‌మైన ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘కంచె’ అంటూ ఈసినిమాను ఆకాశానికి ఎత్తేసాడు చిరంజీవి. 

అంతేకాదు హాలీవుడ్ సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా ‘కంచె’ అంటూ వరుణ్ తేజ్ నటనలోని పరిపక్వత చూసి  తానూ ఆశ్చ‌ర్య‌పోయాను అంటూ కామెంట్స్ చేసాడు చిరూ. మెగా స్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి తమను గౌరవించి నందుకు పొంగిపోయిన క్రిష్ ఒక ఆశ్చర్యకరమైన విషయం బయట పెట్టాడు. 

ఇవాళ తన  తండ్రి  పుట్టిన‌రోజు అని చెపుతూ  ఇలా చిరంజీవిగారు తనను ఇంటికి పిలిచార‌ని చెప్పగానే తనను తన తండ్రి కౌగ‌లించుకుని ముద్దు పెట్టుకున్నారని తానూ వేదం తీసిన‌ప్పుడు కూడా తన తండ్రి  అంత‌గా ఆనందించ‌లేదు కాని ఇవాళ తనను చిరంజీవి పిలిచారు అంటే అంత పొంగిపోయారు అంటూ క్రిష్ చిరంజీవి పై తమ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని తెలియ చేసాడు. చిరంజీవి అతిథి పాత్ర చేసిన ‘బ్రూస్ లీ’  ప్రమోషన్ కు దూరంగా ఉన్న చిరంజీవి ‘కంచె’ ప్రమోషన్ కోసం రంగంలోకి దిగడం నేటి హాట్ టాపిక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: