
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్న రఘుబాబు తల్లి. గిరిబాబు, శ్రీదేవిలకు ముగ్గురు సంతానం కాగా ఇందులో ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు.
కుమారులతో గిరిబాబు
ఆమె గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో విలన్ , కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన గిరిబాబు వందల చిత్రాల్లో నటించారు.. తనయుడు కూడా తండ్రిబాటలోనే నిలిచాడు.
గిరిబాబు ఫ్యామిలీ చిత్రం
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన తల్లిగారు మరణంతో రఘుబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు. గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి టాలీవుడ్ వర్గాలు సంతాపం ప్రకటించారు.