మంచు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఒకేరోజు పుట్టారు. దీనికితోడు వీరిద్దరూ మంచి స్నేహితులు కూడ. ఈ సాన్నిహిత్యంతోనే వీరిద్దరూ తరుచు కలుస్తూ ఉంటారు. ఈనేపధ్యంలో లేటెస్ట్ గా మనోజ్ జూనియర్ ఇంటికి వెళ్లినప్పుడు జూనియర్ కొడుకు మంచు మనోజ్ కు చుక్కలు చూపించాడని స్వయంగా మనోజ్ తన పేస్ బుక్ లో కామెంట్ చేస్తూ ‘తారక్‌ కి కరెక్ట్‌ మొగుడు' అంటూ మంచు మనోజ్ అభిరామ్ అల్లరికి సంభందించిన విషయాలను షేర్ చేసాడు.   

అభయ్ రామ్ చేసిన అల్లరికి మంచు మనోజ్ తట్టుకోలేకపోతే అభయ్‌ రామ్‌ చల్లటి నీళ్ళతో కూడిన గ్లాస్ ను అందించి మనోజ్ అలసట తీరుస్తున్నాడు. మనోజ్ మాటల ప్రకారం అభయ్‌ ఎనర్జీ ఏకంగా తారక్‌ ఎనర్జీకి 100 రెట్లు ఎక్కువట.  అందుకే ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌ చిచ్చర పిడుగు అని అంటున్నాడు మనోజ్. 

జూనియర్ పుట్టినరోజునాడు కూడ అభయ్ రామ్ జూనియర్ తలపై కూర్చుని చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలందరిమధ్య సఖ్యత ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులలో చాలా తేడా ఉంది అన్న సంకేతాలు ఈ ఫోటో ద్వారా అందరికీ తెలిసేలా ప్రయత్నిస్తున్నాడు మనోజ్. 

ఈమధ్య కాలంలో  హీరోలు చాలా మంది మల్టీ స్టార్ మూవీల వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జూనియర్ మంచు మనోజ్ ల కాంబినేషన్ లో ఒక మల్టీ స్టార్ మూవీ వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న సంకేతాలు ఈఫోటో కలిగిస్తోంది. దీనికితోడు జూనియర్ కొడుకు అభయ్ రామ్ హడావిడి చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే చిన్న వయసులోనే బాలనటుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా ? అన్న సందేహాలు కూడ అభయ్ ఫోటోలను చూస్తే ఎవరికైనా ఆలోచన రావడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: