సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ 'మహర్షి' సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. మొదలు కావడం ఏంటి.. దాదాపు చివరిదశకు వచ్చేసింది.   వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' వచ్చేనెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి నాలుగు పాటలను రిలీజ్ చేసిన 'మహర్షి' టీమ్ తాజాగా 'పాల పిట్ట' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ ఒక్క శంకర్ మహదేవన్ పాడిన పాట ‘పదరా పదరా’  మినహా అన్ని పాటలపై అభిమానులు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. 


ఆ మద్య చరణ్ రంగస్థలం సినిమాకు దాదాపు ఒక్క పాట మినమా అన్ని పాటల్లో మంచి ఊపుందని..మహర్షిలో ఆ స్థాయిలో సాంగ్స్ కనిపించడం లేదని అవేదన చెందుతున్నారు.  తాజాగా జానపద బాణీలో సాగే ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ ఆడియన్స్ ను మెప్పించే ట్యూన్ ఇచ్చాడు.  ఈ పాటలో పూజా హెగ్డే చాలా సెక్సీగా కనిపిస్తుంది.  మహేష్‌బాబు ఫ్యాన్స్ స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసేలా ఉంది ఆ సాంగ్.


‘మహర్షి’ నుంచి ఐదో పాట ‘పాలపిట్టలో వలపు’ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. ర్యాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌, ఎం.ఎం. మాన‌సి పాడిన ఈ పాట‌కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాల‌పిట్ట సాంగ్‌కు శ్రీ మ‌ణి సాహిత్యం అందించారు. లిరిక‌ల్ వీడియో సాంగ్ అయినా.. భ‌విష్య‌త్తులో మంచి మాస్ సాంగ్ అవుతుంద‌టున్నారు అభిమానులు.  


'మహర్షి' లో అల్లరి నరేష్.. జగపతి బాబు.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు-అశ్విని దత్-పీవీపీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'మహర్షి' మే 9 న రిలీజ్ కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: