వచ్చేనెల జరగబోతున్న సంక్రాంతి సినిమాల వార్ మహేష్ బన్నీల ఇగో వార్ గా మారిన నేపధ్యంలో వీరి సంక్రాంతి సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ చాల ముందుగా మొదలు పెట్టడమే కాకుండా వీరి సినిమాలకు సంబంధించిన పాటలకు టీజర్లకు మధ్య జరుగుతున్న హిట్స్ వార్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనితో వీరి సినిమాల టీజర్లకు పాటలకు యూట్యూబ్ లో వస్తున్న హిట్స్ ఫేక్ రికార్డులు అంటూ ప్రచారం మొదలైంది. 

ఈ నేపధ్యంలో ఈ రికార్డులను విశ్లేషిస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ఆ సక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘సామజవరగమన’ పాటకు 100 మిలియన్ వ్యూస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వచ్చాయి అన్న వార్తలు చూసి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కూడ షాక్ అవుతున్న విషయాలను తన కథనంలో వివరించింది. 

ఈ విషయమై బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడ కొన్ని అనుమానాలు ఏర్పడటమే కాకుండా బన్నీ మహేష్ ల నిర్మాతలు తమ మూవీల డిజిటల్ ప్రమోషన్ కు హిట్స్ విషయంలో రికార్డులకు కొన్ని హైర్ ఎజన్సీస్ ని ఏర్పరుచుకుని వ్యూస్ విషయంలో హైక్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న సందేహాలు బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడ ఏర్పడినట్లు తన కథనంలో కామెంట్ చేసింది. అయితే ఈ కథనంలో పేర్కొన్న విషయాల పై ‘అల వైకుంఠపురములో’ పాటలను విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ స్పందన వేరే విధంగా ఉంది. 

తమ సంస్థకు 10 మిలియన్ సబ్ స్క్రిబర్స్ ఉన్నారని దానితో తమ సంస్థ నుంచి విడుదలయ్యే పాటలు క్లిక్ అయితే 100 మిలియన్ మార్క్ ను అందుకోవడం పెద్ద కష్టంకాదు అంటూ ఈకథనాన్ని ప్రచిరించిన మీడియా సంస్థ ప్రతినిధితో అన్నట్లు కూడ ఆ కథనంలో పేర్కొనబడింది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సంక్రాంతి వార్ ను మహేష్ బన్నీలు తమ వ్యక్తిగత ప్ర్రతిష్టకు సంబంధించిన వార్ గా తీసుకున్న పరిస్థితులలో ఈ డిజిటల్ వార్ లో ఎక్కడో అక్కడ ఫేక్ రికార్డ్స్ చోటు చేసుకునే అవకాశం తీసివేయలేము అంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: