త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ సినిమా కథ విషయంలో అల్లు అర్జున్ ను ఒప్పించడానికి అనేకసార్లు ఆకథలో మార్పులు చేస్తూ తన అలవాటుకు భిన్నంగా ప్రవర్తించి చాల అసహనానికి గురి అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ ఆకోపం బన్నీ పై తీర్చుకునే అవకాశం వచ్చిందా అంటూ జోక్స్ పడుతున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ మూవీ షూటింగ్ ను ఈ నెలలో మొదలు పెట్టడానికి అంగీకరించిన బన్నీ ఈ మూవీకోసం తన జుట్టును అదేవిధంగా తన గెడ్డంను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడట. అయితే ఈ విషయాలు తెలుసుకున్న త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అయ్యే వరకు బన్నీ లుక్ లో మార్పులు రావడానికి తాను అంగీకరించను అనీ స్పష్టంగా తెలియ చేసినట్లు టాక్.

‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రమోషన్ లో బన్నీ ఈ సినిమాలో ఎలాంటి లుక్ తో కనిపిస్తాడో అలాగే కనిపించాలి కానీ దానికి భిన్నంగా పెరిగిన గెడ్డం జుట్టుతో కనిపిస్తే బాగుండదు అని అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీనితో త్రివిక్రమ్ సూచన మేరకు బన్నీ తన లుక్ మార్చుకునే విషయం జనవరి రెండవ వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

బన్నీ తీసుకున్న ఈ లేటెస్ట్ నిర్ణయంతో ఈ నెల షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచనలు చేస్తున్న సుకుమార్ ప్లాన్స్ లో మార్పులు జరిగి బన్నీ సుకుమార్మూవీ షూటింగ్ ఫిబ్రవరికి వాయిదా పడినట్లు టాక్. దీనితో సుకుమార్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు రావడం చాల కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ సుకుమార్ పై కొందరు సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనేక వాయిదాలు పడుతూ పోతున్న సుకుమార్ కు షాక్ అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ పై బయట పడకుండా స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..     

మరింత సమాచారం తెలుసుకోండి: