బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్‌లు ఇవన్నీ చిటికెలో జరిగిపోతుంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే షాకిద్కపూర్, కరీనాకపూర్ లా ప్రేమాయణం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేశారు. ముంబయిలో ఎక్కడ చూసినా వీరి జంటే కనిపించేది. ఇక అందరూ వీరిద్దరూ పెళ్ళి చేసేసుకుంటారు. వీరి వ్యవహారం పెళ్ళి వరకు వెళ్ళిపోయింది అనుకున్నారు. వీరిద్దరికీ `జబ్ వుయ్ మెట్` చిత్రంతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ప్రేమలో పడ్డాక కొన్నిరోజులు డేటింగ్ చూడా చేశారు. ఆ సమయంలో ఎందుకో గాని ఇద్దరి మధ్య మనస్వర్ధలు ఏర్పడి విడిపోయారు. తర్వాత సైఫ్ కరీనాల పెళ్ళి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక మీరాతో షాహిద్‌కపూర్ తో పెళ్లి పీటలెక్కాడు. ఇటీవలె మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా...షాహిద్‌తో తనకు జరిగిన బ్రేకప్ పై స్పందించింది. ``జబ్ వియ్ మెట్`, `తషాన్` సినిమాలకు మధ్య నా జీవితంలో చాలా జరిగింది. `జబ్ వియ్ మెట్` సినిమా కథ ముందుగా షాహిద్ విని నన్ను ఆ సినిమా చేయమని చెప్పాడు. అలా ఆ సినిమాలో నేను భాగమయ్యాను. మా ఇద్దిరి జీవితాల్లో విధికి ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. అందుకే మేం విడిపోయాం. ఎవరి దారులు వారు చూసుకున్నామ`ని కరీనా చెప్పింది. `
తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని కలిసి బ్రతుకుదాం అనుకున్నారు కానీ విధి వారిని విడదీసింది. కారణాలు ఏమైనప్పటికీ చాలా మందికి ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీలే ఎక్కువగా ఉంటాయి. ప్రేమించుకున్న జంటలు పెళ్ళి వరకు వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి జంటలు కూడా బాలీవుడ్లో ఉన్నాయి. ఒకవేళ ప్రేమ ఫలించి అది పెళ్ళి వరకు వెళితే కొన్ని రోజులకే విడిపోయిన జంటలూ లేకపోలేదు. మరి దీన్ని బట్టి చెప్పాలంటే ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా సహజం.