- ప‌రుచూరు, అద్దంకిలో పార‌ని జ‌గ‌న్ నాన్ లోక‌ల్ పాచిక‌
- ఎన్నిక‌ల ముందే చేతులెత్తేసిన ఇద్ద‌రు వైసీపీ క్యాండెట్లు
- క‌మ్మ ఇలాకాలో రెడ్డి, కాపు ఈక్వేష‌న్ కూడా బిగ్ రాంగ్ స్టెప్‌


( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలలో చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇటు, అటు.. అటు, ఇటు మార్చేశారు. నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేల స్థానాలను వేరేచోటకు మార్చి.. మరోచోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో పోటీకి పెట్టారు. స్థాన చలనం జరిగిన వారిలో సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలలో జగన్ చేసిన నాన్ లోకల్ ప్రయోగం ఎన్నికలకు ముందే పూర్తిగా వికటించిన పరిస్థితి. అలాంటి నియోజకవర్గాలలో బాపట్ల జిల్లాలోని పరుచూరు, అద్దంకి గురించి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలోనే చర్చ జరుగుతుంది. ఈ రెండు చోట్ల జగన్ చేసిన నాన్ లోకల్ ప్రయోగం ఒక మైనస్.


అయితే ఇక్కడ వైసీపీ ప్రయోగించిన క్యాస్ట్ ఈక్వేషన్లు కూడా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. వాస్తవంగా చూస్తే గత కొన్ని దశాబ్దాలుగా అద్దంకి, పరుచూరు రెండు ప్రధాన పార్టీలలూ కూడా కమ్మ‌సామాజిక‌ వర్గానికి పెట్టని కోటలుగా ఉంటూ వస్తున్నాయి. జగన్ సైతం 2014, 2019 ఎన్నికలలో రెండు సీట్లను క‌మ్మ‌ సామాజిక‌ వర్గానికి కేటాయిస్తూ వచ్చారు. ఈసారి అనుహ్యంగా అద్దంకిలో రెడ్డిని, పరుచూరులో కాపు వర్గానికి చెందిన నేతను పోటీలో పెట్టిన జగన్.. బీసీలు ఎక్కువగా ఉన్న చీరాలలో కమ్మ నేత కరణం వెంకటేష్‌కు సీటు ఇచ్చారు. ఇది పూర్తిగా రాంగ్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇక అద్దంకి, పరుచూరులో క్యాస్ట్ ఈక్వేషన్ పూర్తిగా తప్పు. ఎక్క‌డో ప‌ల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం, దొడ్లేరుకు చెందిన పారిశ్రామికవేత్త చిన్న హణిమి రెడ్డికి అద్దంకి సీటు ఇచ్చారు.


హణిమి రెడ్డి వైసీపీ ప్రారంభంలో కొంతకాలం పాటు పెదకూరపాడుకు ఇన్చార్జిగా వ్యవహరించారు. అలాంటి నేతకు అద్దంకి రూపురేఖలు తెలియని చోట సీటు ఇవ్వటం.. లోకల్ వైసీపీ క్యాడర్‌కే ఇష్టం లేదు. ఇక ఎప్పుడో 2014లో వైసీపీ నుంచి చీరాలలో పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకున్న పారిశ్రామికవేత్త ఎడం బాలాజీ.. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి కొంతకాలం చీరాల ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు బాలాజీని కొద్ది రోజులకు ముందు తిరిగి పార్టీలోకి తీసుకొని పరుచూరు సీటు ఇచ్చారు. ఆయన కూడా ఎక్కువ అమెరికాలోనే ఉంటారు. పరుచురుకు బాలాజీకి అస్సలు సంబంధం లేదు. ఇక్క‌డ రూపురేఖ‌లు, బోర్డ‌ర్లు తెలియ‌వు.. ప్ర‌జ‌ల బాధ‌లు ఆయ‌న‌కు ప‌ట్ట‌వు. ఏది ఏమైనా లోకల్, నాన్‌లోకల్ ఈక్వేషన్ తో పాటు.. క్యాస్ట్ ఈక్వేషన్ లో జగన్ వేసిన ఎత్తులు అద్దంకి, పరుచూరిలో ఎంత మాత్రం స‌క్స‌స్ అయ్యేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: