జూన్ నెలలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఈ వరల్డ్ కప్ టోర్ని పైనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే యుఎస్ వెస్టిండీస్ వేదికలలో జరగబోయే ఈ వరల్డ్ కప్ టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయ్. ఇందులో వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న జట్లతో పాటు ఇక కొన్ని పసికూన టీమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ జట్టు ప్రకటన విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకి డెడ్ లైన్ విధించింది.


 ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వరకు కూడా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలోనే.. ఆయా దేశంలో చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న యుఎస్ఏ కూడా ఇటీవల టీ20 వరల్డ్ కప్ జట్టు వివరాలను ప్రకటించింది. ఇలా యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు వివరాలు చూసుకుంటే.. అందులో పూర్తిగా భారతీయులే నిండి ఉన్నారు అని తెలుస్తుంది. అంతేకాదు ఇక జట్టు కెప్టెన్ గా కూడా భారత సంతతికి చెందిన మోనాక్ పటేల్ ఉండడం గమనార్హం.


 ఇలా యూఎస్ఏ క్రికెట్ బోర్డు టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో భారత సంతతికి చెందిన మోనాంక్ పటేల్ కెప్టెన్ గా ఉండగా.. సౌరబ్ నేత్ర వల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్ పటేల్ చోటు సంపాదించుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లలో న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ కోరే అండర్సన్ కూడా ఉండడం గమనార్హం. అయితే ఇలా యూఎస్ఏ జట్టులో ఐదుగురు కూడా భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్  మారిపోయింది. కేవలం యుఎస్ఏ జట్టులో మాత్రమే కాదు మిగతా దేశాల జట్టులో కూడా ఈ మధ్యకాలంలో భారత సంతతి ఆటగాళ్లు చోటు సంపాదించుకుంటూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: