పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు మొగలయ్యకు సంబంధించిన ఒక వీడియో గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే గత కొద్ది రోజుల నుంచి తను ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ జానపద కళాకారుడు హైదరాబాదులో ఒక నిర్మాణ సంస్థలలో డైలీ వారి కూలీల పని చేస్తూ కనిపించారు.. ఈ విషయం చాలామందిని కదిలించింది. ముఖ్యంగా తన నెలసరి గౌరవ వేతనం కూడా ఆగిపోయిందని అందుకే తన పొట్టకూటి కోసం కూలి పనికి వెళుతున్నట్లుగా ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మొగలయ్య..


ఈ వీడియో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేరడంతో మొదలయ్య కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ విధంగానే తాను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున పద్మశ్రీ కిన్నెర మొగలయ్యను కూడా కలిసి అతని యోగక్షేమాలు కూడా తెలుసుకొని అందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.. మొగలయ్యకు కూడా భరోసా కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని అలాంటి ఒక గొప్ప జానపద కళాకారుడిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా గర్వకారణం అంటూ కూడా తెలియజేశారు.


ఈ విషయం పైన చాలామంది సినీ ప్రముఖులు, నేతలు కూడా అభినందిస్తున్నారు కేటీఆర్ ని. ఇప్పుడు తాజాగా టాలీవుడ్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా స్పందిస్తూ మొగలయ్యకు అండగా నిలిచినటువంటి టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు ధన్యవాదాలు అంటూ కూడా తెలియజేశారు.. అలాగే ఇలాంటి నాయకుడే నిజమైన నాయకుడు అనిపించుకున్నారు అంటూ తన ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. బ్రహ్మాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా చాలామంది మొగలయ్యకు సపోర్టుగా సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా పాట పాడే అవకాశం కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: