ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి  కనిపిస్తోంది. అయితే మొత్తంగా తెలంగాణలో 17 స్థానాలలో ఎన్నికలు జరుగుతూ ఉండగా.. అందరి దృష్టి మాత్రం ఒకే ఒక స్థానం పైన ఉంది. అదే హైదరాబాద్ ఎంపీ సీటు. ప్రస్తుతం రాష్ట్రంలోని మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏదో ఒక పార్టీ గెలిచి తీరుతుంది. ఇది కామన్ కానీ ఇక హైదరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంఐఎం తప్ప మరో పార్టీ గెలవలేదు. అక్కడ మజిలీస్ పార్టీ జెండా తప్ప ఇంకో పార్టీ జెండా ఎగరలేదు. దీంతో అలాంటి మజిలీస్ పార్టీ కంచుకోట ఈసారి బద్దలవుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


 ఈ క్రమంలోనే ఎంఐఎం కంచుకోటని బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం బిజెపి మాధవి లతను బరిలోకి దింపింది. అయితే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటివరకు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలలో కూడా విజయం సాధించిన ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేసేది ఏమీ లేదు అంటూ మాధవి లత ప్రసంగాలతో దూసుకుపోతున్నారు. 40 ఏళ్లలో ఎంఐఎం నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలి అంటూ ఇక అక్కడి ఓటర్లకు సూచిస్తున్నారు. హిందువులు ముస్లింలు అనే తేడా నాకు లేదు. పాతబస్తీ కూడా ఇతర పార్లమెంట్ నియోజకవర్గం మాదిరిగానే  అభివృద్ధి చెందాలి. ఇందుకు బిజెపి కు ఓట్లు వేయండి అంటూ ఆమె అభ్యర్థిస్తున్నారు.


 దీంతో ఎంఐఎం పార్టీకి అటు బిజెపి అభ్యర్థి మాధవి లత గట్టి పోటీ ఇస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరించబోతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గం లోని మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట, యాకుత్పురా, బహదూర్పురా నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇక వీటిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చంద్రయాన్ గుట్ట నియోజకవర్గాలలో జరిగే పోలింగ్ సరళి ఇక అక్కడ పార్లమెంట్ స్థానంలో గెలుపు ఓటమిలు నిర్దేశిస్తుందని టాక్ ఉంది. ఈ క్రమంలోనే బిజెపి ఇక ఎంఐఎం ను  ఓడించేందుకు ఒక బలమైన వ్యూహాన్ని పన్నింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో హిందువుల ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని బిజెపి నాయకత్వం సూచించిందట. ఇక ఆ దిశగానే బిజెపిలోని కీలక నేతలందరూ కూడా ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్ట తెలుస్తుంది. ఒకవేళ బిజెపి వ్యూహం పలించిందా భారీ మెజారిటీతో కమలం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: