ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ తన దైన ముద్ర వేశారు. ఇది వాస్తవం. ప్రతి నెలా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఠంచనుగా పెన్షన్లు ఇంటికే వచ్చేవి. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటికే తెచ్చిస్తుంటే.. దీనిని రాజకీయ లబ్ధి కోసం అడ్డుకొని విధులకు దూరం పెట్టించారు.


ఇప్పుడు ఎండలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పింఛన్ దారులు ఇబ్బందులు పడుతుంటే.. వారి గురించి ప్రచారం చేస్తూ టీడీపీకి మైలేజ్ తీసుకు వచ్చేలా కథనాలు ప్రచురిస్తోంది  ఎల్లో మీడియా. అసలు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు అవసరమా.. ఈ వ్యవస్థ అవసరమా అనే దశ నుంచి మేం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాం అనే స్టేజీకి వచ్చేశారు చంద్రబాబు నాయుడు. ఇక పింఛన్ల విషయంలో వాలంటీర్లను దూరం పెట్టి హమ్మయ్య అని సంతోషపడేలోపు.. పింఛన్ దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.


వాలంటీర్ వ్యవస్థపై ఇంత రెస్పాన్స్ ను టీడీపీ ఊహించలేకపోయింది. దీంతో నష్టనివారణ చర్యలను టీడీపీ చేపట్టింది. సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తుంటే.. క్యూలైన్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విధానం కరెక్ట్ కాదని వినతి పత్రాలు ఇప్పించారు. ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంటే.. దీనిని ప్రభుత్వ వైఫల్యంగా ముఖ్యంగా సీఎం జగన్ చేసిన తప్పిదంగా చూపించాలని ఎల్లో మీడియా శాయశక్తులా కృషి చేస్తోంది.


ఇప్పుడు పింఛన్ దారులు బ్యాంకులకు వెళ్లి పడుతున్న ఇబ్బందులపై స్పెషల్ ఫోకస్ మాదిరిగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలు వారు పడుతున్న అవస్థలను చిత్రాలతో సహా వివరిస్తోంది. అవునన్నా కాదన్నా ఇది చంద్రబాబు ఆపించారు అని ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఇలా ఫొటోలతో ప్రచారం చేయడం వల్ల వైసీపీకే మైలేజ్ వస్తుంది తప్ప టీడీపీకి రాదు. ఎందుకంటే ప్రజలు పడుస్తున్న అవస్థలకు చంద్రబాబే కారణం అని ఎల్లో మీడియానే డప్పు కొట్టినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: