సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందుతూ ఉంటుంది. అయితే ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి కూడా కొంతమంది ఆటగాళ్ల విషయంలో అభిమానులు పెట్టుకున్న అంచనాలు కొన్ని కొన్ని సార్లు తారుమారు అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అద్భుతంగా రాణిస్తారు అదరగొడతారు అనుకున్న ఆటగాళ్లు చెత్త ప్రదర్శనలతో నిరాశ పరుస్తూ ఉంటారు. అయితే కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు వరుసగా విఫలమవుతుంటే అటు కొత్తగా ఐపీఎల్లోకి వచ్చిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.


 ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది అని చెప్పాలి. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు చెత్త ప్రదర్శనలతో నిరాశ పరుస్తున్నారు. అలాంటి వారిలో ఆర్సిబి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్ వెల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఏకంగా 11 కోట్లు వెచ్చించి అతన్ని రిటైన్ చేసుకుంది ఆర్సిబి జట్టు. కానీ అతనికి దక్కిన ధరకు అతను ఎక్కడ న్యాయం చేయలేకపోతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అతను ఏడు మ్యాచ్లు ఆడి కేవలం 36 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రంగా నిరాశలో మునిగిపోతున్నారు.


 ఇప్పుడు వరకు ఏడు మ్యాచ్లలో మ్యాక్స్ వెల్ 5.14 యావరేజ్ తో  కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కొన్ని మ్యాచ్లలో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుతిరిగాడు. దీంతో ఇలాంటి ఆటగాడిని 11 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారా అంటూ ఆర్సిబి యాజమాన్యంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాళ్ళ దేశం తరఫున అయితే హిట్టింగ్ చేస్తాడని..  ఐపీఎల్లో మాత్రం ప్రతిసారి కూడా విఫలమవుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. అయితే అతను ఆడిన మ్యాచ్లలో కోల్కతాతో జరిగిన పోరులో చేసిన 28 పరుగుల అతనికి అత్యధిక స్కోర్.. మిగతా అన్ని మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కాగా.. మూడు మ్యాచ్లలో డక్ అవుట్ గా వెను తిరిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb