ఈసారి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు టిడిపి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ పార్టీ ప్రచారం చేస్తున్న తీరు అమలు చేస్తున్న వ్యూహాలన్నీ కూడా చంద్రబాబు గెలవాలని తపనతో చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు.ఆ తర్వాత శంఖారావం అనే సభలను కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ పలు రకాల సభలతో ముందుకు వెళ్తున్నారు.. నందమూరి బాలకృష్ణ కూడా రాయలసీమ అంతటా కూడా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ప్రచారం చేస్తున్నారు.


బాలయ్య ఇద్దరు కుమార్తెలు కూడా అటు మంగళగిరి, విశాఖపట్నం, హిందూపురం వంటి నియోజకవర్గం ప్రచారం చేస్తున్నారు.బాలయ్య భార్య వసుంధర కూడా ఏకంగా హిందూపురంలోనే ఉంటూ తీవ్రమైన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పంలో కూడా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తోంది.. నారా కుటుంబం నుంచి సినీ హీరో రోహిత్ కూడా తాజాగా ఎన్నికలలో ప్రచారంలో భాగమయ్యారు. ఈరోజు నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా అన్ని ప్రాంతాలు చుట్టేస్తూ ముందుకు వెళ్తున్నారు.


నందమూరి రామకృష్ణ కూడా కృష్ణాజిల్లాలో టిడిపి పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇలా వీరందరూ కలిసి టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.. ఈసారి కచ్చితంగా టిడిపి గెలిచాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఒకవేళ ఈసారి టిడిపి గెలిస్తే వారసుడుగా నారా లోకేష్ ఎదిగేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టిడిపి పార్టీ అధికారంలోకి ఉండగానే నారా లోకేష్ కి పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 2029 కి తన కుమారుడిని సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇన్ని కలలు నెరవేరాలంటే కచ్చితంగా టిడిపి పార్టీ అధికారంలోకి రావాలి.. ఒకవేళ రాకపోతే ఎన్నో ఇబ్బందులను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది.. ఈ ఎన్నికలు మాత్రం టిడిపి పార్టీకి జీవస్మరణ సమస్యగా మారుతోంది. ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల ఇంతటి ఎండలో కూడా లెక్కచేయని నారా నందమూరి కుటుంబాలు రోడ్లమీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: