•పాయకరావుపేటలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య ఆసక్తికర రాజకీయం
•ప్రచారంలో అనిత కంటే వెనకబడి ఉన్న జోగులు
•లోకల్ ముందు తేలిపోతున్న నాన్ లోకల్  


పాయకరావుపేట - ఇండియాహెరాల్డ్: పాయకరావుపేటలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ గట్టిగా నడుస్తుంది. అటు వంగలపూడి అనితకి పోటీగా నాన్ లోకల్ కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. అయితే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా సాగే ఈ పోరులో ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తి నెలకొంది. చరిత్ర కనుక చూసుకుంటే పాయకరావుపేట టీడీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం.ఎందుకంటే ఇప్పటి దాకా ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది.4  సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, రెండుసార్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత ఇక్కడ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై ఏకంగా 2828 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల బాబూరావు విజయం సాధించారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చి పంపించేసిన జగన్ మోహన్ రెడ్డి సిక్కోలు జిల్లా నుంచి రాజాం సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కంభాల జోగులును పిలిపించి టిక్కెట్ ఇవ్వడం జరిగింది. అయితే నాన్ లోకల్ గా పాయకరావుపేటలో అనిత కంటే కొంచెం వెనకబడ్డారని సమాచారం తెలుస్తుంది.


ఎందుకంటే 2014లో  గెలిచిన అనిత.. వాక్ చాతుర్యంతో తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఎమ్మెల్యేగా ఎన్నికకాడానికి ముందు టీచర్‌గా పనిచేశారు అనిత. ఒక టీచర్ కి ఉన్న తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనిత మొదట్లో రాజకీయ నిర్ణయాలు తీసుకోలకే ఇబ్బందిపడినా ఇప్పుడు స్వతంత్రంగా గట్టిగా వ్యవహరించే నేతగా స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు ఆమె ఏ నేత సపోర్ట్ లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలగుతున్నారు. పైగా ప్రజల్లో అనితకి వ్యతిరేకలేకపోవడం..పైగా టీడీపీకి పాయకరావుపేటలో గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో కంబాల కంటే అనితకు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది.కానీ వైసీపీ మాత్రం అసలు పాయకరావుపేటలో ఎవరికీ తెలియని నాన్ లోకల్ కంబాల జోగులుకు టికెట్ ఇచ్చి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బలమైన నాయకుడు అయినా  నాన్ లోకల్ కావడంతో  ప్రచారంలో వెనకుబడ్డారు. లోకల్ గా అనిత మాత్రం ఇప్పటికే నియోజకవర్గం అంతా తిరిగేసారు. ఈ సారి అనితకు పార్టీలో వ్యతిరేకత లేకపోవడం పెద్ద ప్లస్ గా కనిపిస్తోంది. పైగా ఆమె లోకల్ కాబట్టి నాన్ లోకల్ కంబాల జోగులు పై గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అంతిమ పోరులో పాయకరావుపేట జనాలు నాన్ లోకల్ కి ఓట్లు వేసి అవకాశం ఇస్తారో లేదా తమ లోకల్ ని గెలిపిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: