ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.. రాష్ట్రంలో మరో 7 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ రీసెంట్ గా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రస్తుత పధకాలను కొనసాగిస్తూ వాటి స్థాయిని మరింత పెంచనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు. అలాగే ఉమ్మడి కూటమి కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది.అయితే ఉమ్మడి కూటమి మ్యానిఫెస్టో కు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉంది. టీడీపీ,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేసాయి..దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది

 ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి,సంక్షేమం కావాలంటే కూటమి కి ఓటు వేయాలని చంద్రబాబు, పవన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని నమ్మి మరోసారి మోసపోవద్దు అంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు పార్టీలలో ఈ సారి అధికారం  ఎవరికీ దక్కనుందో తాజాగా ఆత్మ సాక్షి సర్వే తేల్చేసింది.ఆత్మసాక్షి సంస్థ తాజాగా  6 వ రౌండ్ సర్వే జరిపింది. ఈ సర్వే గత నెల 24 నుంచి మే 4 వరకు కొనసాగినట్లు వారు తెలిపారు.. తాజాగా వారు నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సారి అధికార వైసీపీకి 48.5 శాతం ఓటు షేర్ రానున్నట్లు తెలిపింది. అలాగే ఉమ్మడి కూటమికి 46 శాతం, ఇతరులు 2 శాతం ఓటింగ్ షేర్ పొందనున్నట్లు తెలిపింది. ఇక వైసీపీకి 95 నుండి 113 సీట్లు రావొచ్చని అలాగే ఉమ్మడి కూటమి 56 నుండి 62 సీట్ల వరకు గెలవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది..రాష్ట్రం లో మరోసారి వైసీపీ అధికారం లోకి రాబోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అయితే గతంలో పోల్చుకుంటే వైసీపీ గ్రాఫ్ కాస్త తగ్గినట్లుగా ఈ సర్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: