తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన కొన్ని సంవత్సరాల క్రితం బిచ్చగాడు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మొదట తమిళ్ లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేస్తుంది.

అలా తమిళ సినీ పరిశ్రమ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమాను ఆ తర్వాత బిచ్చగాడు అనే టైటిల్ తో తెలుగు లో విడుదల చేశారు. ఇక ఈ మూవీ తెలుగు లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ తో విజయ్ ఆంటోనీ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలను తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన లవ్ గురు అనే సినిమాలో హీరో గా నటించాడు. వినాయక్ వైతినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా యొక్క తమిళ్ వర్షన్ డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మే 10 వ తేదీ నుండి ఈ సినిమాను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమిళ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

va