ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం మీద ఢిల్లీ నుంచి గల్లీ దాకా బిజెపి నేతలు అందరూ కూడా ఆ ఒక్క నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు.. ముఖ్యంగా అక్కడ వైసీపీ అభ్యర్థి మీద పై చేయి కోసం బిజెపి బెటాలియన్ మొత్తాన్ని దింపుతోంది.. అయితే ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఒక నేత మాత్రం ఆ వైపుకు అస్సలు అడుగులు వేయలేదు..సైలెంట్ గా ఉంటున్నారు.. జాతీయ నేతలు వస్తున్న కూడా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఆ నేత ఎవరు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే టిడిపి జనసేన బిజెపి పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మరికొన్ని చోట్ల తీవ్రమైన వివాదాస్పదంకరంగా కూడా మారుతున్నాయి.. అలాంటి నియోజకవర్గాలలో సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. గతంలో టిడిపి వర్సెస్ కాంగ్రెస్ ఉండగా.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా మారిపోయింది.. ఇక్కడ కూటమిలో భాగంగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మొదటిసారి ఎన్నికలలో ధర్మవరం బరిలో దిగబోతున్నారు.

అయితే గతంలో సత్యకుమార్ స్థానంలో ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేయాలనుకున్నారు.. సీటు రాకపోవడంతో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ టికెట్ కోసం ఇరువురు నేతలు వాగ్వాదం చేసుకుంటూ ఉండగా పొత్తులో భాగంగా ఈ టికెట్ బిజెపికి ఖరారు అయింది.. దీంతో అటు టిడిపి జనసేన నుంచి డిమాండ్స్ కూడా భారీగానే వచ్చాయి.


కానీ ఒక్క రోజులోనే సిన్ మొత్తం మారిపోయింది.బిజెపి అధిష్టానం గోనుగుంట్ల సూర్యనారాయణకు కాకుండా ఆస్థానాన్ని సత్యకుమార్ అనే వ్యక్తికి ఇచ్చారు. చివరిగా ఎన్నో హంగామాలు చేసిన టిడిపి నేత పరిటాల శ్రీరామ్ సత్య కుమార్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే సొంత పార్టీ అయినా సూరి మాత్రం అక్కడ పత్త లేకుండా ఉన్నారట. గతంలో ఇండిపెండెంట్గా ధర్మారం నుండి సూర్యనారాయణ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.. కానీ ఆయన నామినేషన్ వేయలేదు.. ఎవరి తరపున కూడా ప్రచారం చేయడం లేదట.. కొద్దిరోజులుగా సైలెంట్ లో ఉన్న ఈయన సత్యకుమార్ గెలుపు కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు.. పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారానికి కూడా పెద్దగా సమయం లేదనీ తెలిసిన..ఇలాంటి పరిస్థితులలో స్థానికంగా పట్టు ఉన్న  సూర్యనారాయణ ఎటువైపు ఉన్నారు.. ఆయన అనుచరులు ఎక్కడున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: